BRS: నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం..రెండు రోజుల పాటు అక్కడే

-

గులాబీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు వెళ్ళనున్నారు. కల్వకుంట చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు.. గులాబీ పార్టీ నేతలందరూ కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం అంటే బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం… నేరుగా కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శిస్తారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు.

BRS Party MLAs and MLCs will visit the Kaleswaram project today

రాత్రి రామగుండంలో బస చేయనున్నారు. అలాగే రేపు 10 గంటలకు.. అంటే శుక్రవారం రోజున కన్నెపల్లి పంపు హౌస్ వద్ద గులాబీ నేతల సందర్శన ఉంటుంది. అనంతరం 11 గంటలకు మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు వెళ్లి… అక్కడి పరిస్థితులను… పరిశీలిస్తారు గులాబీ నేతలు. దానికి సంబంధించిన ఫోటోలను అలాగే వీడియోలను షేర్ చేసి… రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేయనున్నారు గులాబీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version