తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి పార్టీకి భారీ రిలీఫ్ దక్కింది. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని తాజాగా సర్వేలలో వెల్లడైంది. వచ్చే లోక్సభ ఎన్నికలలో తెలంగాణ నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీకి మెజారిటీ సీట్లు దక్కుతాయని తాజాగా ఇండియా టీవీ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో వెళ్లడైంది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు గాను ఎనిమిది స్థానాలలో భారత రాష్ట్ర సమితి పార్టీ విజయం సాధిస్తుందని ఈ ఒపీనియన్ పోల్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది.
కోట్ల శాతంపరంగా చూస్తే భారత రాష్ట్ర సమితి పార్టీకి ఈ లోక్సభ ఎన్నికలలో 40% ఓట్లు దక్కుతాయని తెలిపింది. భారత రాష్ట్ర సమితి పార్టీ తర్వాత భారత జనతా పార్టీకి అత్యధిక స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ ఒపీనియన్స్ పోల్స్ రిపోర్టు తెలుపుతోంది. బిజెపి పార్టీకి ఆరు లోక్సభ స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉందట. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు స్థానాలకే పరిమితం అవుతుందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. మిగిలిన ఒక్క స్థానం మజిలీస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందని స్పష్టం చేసింది ఈ సర్వే సంస్థ.