అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చిన కేటీఆర్

-

అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. అవయవ దానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు కేటీఆర్. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం. మనం అందరికీ ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. వారి వారి నియోజకవర్గాల్లో కూడా అవయవదానం అంశంలో చైతన్యం తీసుకురావాలని చెప్పారు.

BRS Working President and MLA KTR comes forward to donate organs as an assembly witness

ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలి… ఈ మేరకు ఆలోచన ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసనసభ ప్రాంగణంలోనే సంతకాల సేకరణ చేపడదామని సూచిస్తున్నానని చెప్పారు. అందరికంటే ముందు నేనే సంతకం చేస్తానని… అవయవ దానం అనేది గొప్ప మా నవీయ చర్య. ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version