MLA స్థానాలు 153 కు పెంచాలి – సీఎం రేవంత్

-

MLA స్థానాలు 153 కు పెంచాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది తెలంగాణ అసెంబ్లీ. డీలిమిటేషన్‌‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రమాణికం కాదు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నారు. జనాభా నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించిన రాష్ట్రాలకు షాపంగా మారకూడదన్నారు. పార్లమెంట్ స్థానాలను యథాతథంగా కొనసాగించాలని… రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
పునర్విభజనతో మనకు నష్టమేనని.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం 24% నుంచి 19% కి పడిపోతుందన్నారు. డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version