తెలంగాణలో ‘కనుగోలు’ కేంద్రం తప్ప.. కొనుగోలు పనిచేస్తలేదు : కేటీఆర్

-

కాంగ్రెస్ ఆఫీసులో ‘కనుగోలు’ కేంద్రం తప్ప.. రాష్ట్రంలో ఒక్క కొనుగోలు కేంద్రం పనిచేస్తలేదంటూ విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏ రైతుకు ముఖ్యమంత్రి మద్దతు లేదు.. అందుకే వరికి, పత్తికి, దేనికి మద్దతు ధర లేదని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో దోపిడీ రాజ్యమేలుతోందని… రైతుల రెక్కలకష్టం దర్జాగా దళారుల పాలవుతోందని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

BRS Working President KTR setires on sunil kanugolu

సన్నాలకే బోనస్ అన్న సన్నాసుల మాట.. మార్కెట్ యార్డుల సాక్షిగా నీటిమూటే అయ్యిందని… మొన్న రైతుకు రుణమాఫీ చెయ్యలే అంటూ నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న రైతుకు పెట్టుబడి సాయం ఇయ్యలేనని… నేడు రైతు పండించిన పంటను కొనుగోలు చెయ్యలే అంటూ ఆగ్రహించారు. ఇక.. ఈ ఇందిరమ్మ రాజ్యం ఉండెందుకు? అంటూ నిలదీశారు. ఆరుగాలం కష్టించే అన్నదాతను అరిగోస పెట్టేటందుకా? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version