ఈ సంవత్సర కాలంలో BRS చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, కేసీఆర్ అనారోగ్య పాలవడం, కవిత జైలు కెళ్లడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం, మా పార్టీ ఎమ్మెల్యే లు వెళ్లిపోవడం లాంటి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం అని కేటీఆర్ తెలిపాడు. ఈ ఏడాది కాలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అయినా మాతో పాటే ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్ని విషయాల్లో విఫలం అయింది. ఈ ప్రభుత్వం లో కేవలం ఎనుముల బ్రదర్స్ కు మాత్రమే లాభం జరిగింది. ఒక్కటి కూడా పాజిటివ్ పని చేయలేదు. సీఎం అనేవారు రాష్ట్ర ప్రతిష్ట ను పెంచాలి. కానీ దివాళా దిశగా తీసుకెళ్తున్నాడు.
ఇంగ్లీషు వచ్చిన కొత్త ప్రోలను పెట్టుకున్నాడు. తెలంగాణ ఫాలింగ్ జరుగుతుంటే… రైజింగ్ అని అంటున్నాడు. అప్పులు అని తన అసమర్దన ను చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం పై విమర్శలు చేయొద్దు. సంవత్సర కాలం ఆగండి అని మా కేసీఆర్ చెప్పారు. ఈ సంవత్సరం లో సాధించిన విజయాలు చెప్పట్లేదు. హామీలు ఎలా నెరవేరుస్తారో చెప్పకుండా.. అప్పులు అని అంటున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.