చేనేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికు లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టింది….ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా అంటూ నిలదీశారు. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా ? పదేళ్ల తరువాత సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నాటి సంక్షోభం ఇప్పుడు వచ్చిందన్నారు. నేతన్నల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని… నేతన్నలకు అర్డర్లు అపేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వేంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు కేటీఆర్. చేనేత మిత్ర వంటి పథకాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం… ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి, అవసరం అయితే మరింత సాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికు లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.