కృష్ణా జిల్లాలో ఫించన్ మృతిపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ….పెన్షన్ పంపిణీపై వైసీపీ నీచరాజకీయాలు చేస్తోందని ఆగ్రహించారు. జోగి రమేష్ రాజకీయ సమాధికి పెనమలూరు వేదిక కాబోతోందని… జోగి రమేష్ అధికార దాహం అనే మానసిక రోగం ఉందని మండిపడ్డారు.
వైకాపా అధిష్టానం జోగి రమేష్ ను మూడు నియోజకవర్గాలు మార్చేసరికి అతని మానసిక పరిస్థితి దెబ్బతింది….ఎక్కడ ఎప్పుడు శవం దొరుకుతుందా రాజకీయం చేద్దామనే ఆలోచనతో జోగి ఉన్నాడన్నారు. వజ్రమ్మ మృతికి కారణం ఎవరో వారి కుటుంబ సభ్యులే చెప్తున్నారు.
ఫించన్ పంపిణీ చేయాల్సిన అధికారులు మూడుసార్లు సచివాలయానికి ఇంటికి వజ్రమ్మను తిప్పటంతో ఆమె చనిపోయిందని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారికి ఇంటి వద్దే ఫించన్ ఇవ్వాలనే నిబంధనలను అధికారులు ఉల్లంఘించారు….వజ్రమ్మ చనిపోయిన విషయం తెలుసుకుని వేరే సచివాలయం నుంచి తీసుకొచ్చిన డబ్బులు పంపిణీ చేశారని మండిపడ్డారు బోడె ప్రసాద్.