లోక్‌ సభ ఎన్నికలపై కిషన్ రెడ్డి సంచలన ప్రకటన…!

-

లోక్‌ సభ ఎన్నికలపై కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మే 13వ తేదీన తెలంగాణలో లోక్​ సభలో ఎన్నికలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ లో నాలుగో విడతలో మే 13న ఎన్నికలు ఉంటాయని, జూన్​ 4న ఫలితాల రానున్నాయి అన్ని రకాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టామన్నారు.

ప్రధానమంత్రి ఎంపీ ఎన్నికల ప్రచార ఐదు సభల్లో పాల్గొన్నారని తెలిపారు. అభ్యర్థులందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. అందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఓటు అనేది మన హక్కు ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత అని అన్నారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు 40 శాతానికి మించి ఓటింగ్ శాతం ఉండదు దానిపై మనం దృష్టి సారించాలి ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి వ్యక్తిగతంగా సంఘంగా ఏర్పడి ఓటు వేసే ఉద్యమాన్ని నడపాలని మనమంతా పోలింగ్​ పర్సంటేజీని పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి అందరూ పోలింగ్​ లో పాల్గొనాలని అన్నారు. ఈసారి దేశం, భవిష్యత్తు కోసం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధి కోసం ఓటు వేయాలని అన్నారు. దీంతో మన భవిష్యత్తు కూడా బాగుపడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news