అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

-

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్న తరుణంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న ప్రభుత్వం అంటూ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు.

BRS Working President KTR’s open letter to Assembly Speaker Gaddam Prasad

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలు ఇస్తున్నారని…. శాసససభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా కాలరాస్తోందని రేవంత్ సర్కార్ పై ఫిర్యాదు చేశారు కేటీఆర్‌. ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటాకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలని లేఖలో కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎస్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాలు లేవనెత్తుతామని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version