KTR: సిరిసిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా రిలీజ్ అయిందది. ఇవాళ ఉదయం 11 గంటలకు ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది లో చౌడాలమ్మ జాతరకు హాజరు కానున్నారు కేటీఆర్.

అనంతరం ఉదయం 11.30 గంటలకు ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరు అవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ముస్తాబాద్ మండలం రామలక్ష్మణ పల్లెల్లో పెద్దమ్మ జాతరకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు కు తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరు అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ లో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు హాజరు అవుతారు కేటీఆర్.