అలంపూర్ అభ్యర్థి అబ్రహంను మార్చాలని BRS నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఇప్పటికే అభ్యర్థులకు ప్రకటించి…ప్రచారం లో దూసుకుపోతున్నారు గులాబీ బాస్ సీఎం కేసీఆర్. అయితే.. ఈ తరుణంలోనే.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వంపై గులాబీ బాస్ నిర్ణయం మార్చుకున్నారు.
అందుకే అభ్యర్థిగా అబ్రహం పేరు ప్రకటించినప్పటికీ ఆదివారం నాడు బీఫామ్ ఇవ్వలేదు. అలంపూర్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపే యోచనలో అధిష్టానం ఉంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి నిశితంగా పరిశీలన చేసి మరో నేతను బరిలోకి దింపాలని రిపోర్ట్ ఇచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు స్థానిక నేత విజయుడి పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలిసింది. దీంతో అబ్రహాం స్థానంలో ఒకటి, రెండు రోజుల్లో విజయుడుకి బి ఫార్మ్ ఇవ్వనుంది BRS పార్టీ. దీంతో MLC చల్లా వెంకట్ రామ్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నట్లు అయింది.