కామారెడ్డి నుంచి బరిలోకి రేవంత్ రెడ్డి

-

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా ప్రస్తుతం అందరి ఫోకస్ కామారెడ్డి నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే గజ్వేల్​తో పాటు ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. అయితే విపక్షాలు కూడా కామారెడ్డిపై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రకటించిన మూడో జాబితాలో కామారెడ్డి నుంచి కేసీఆర్​పైకి బరిలోకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని దింపింది ఆ పార్టీ హైకమాండ్.

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ మూడో జాబితాను సోమవారం రాత్రి విడుదల చేయగా.. ఇందులో కామారెడ్డి స్థానానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కామారెడ్డికి ముందు నుంచీ అనుకుంటున్న మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి నిజామాబాద్‌ అర్బన్‌ స్థానం కేటాయించారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్​ను ఓడించాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. అందుకే కేసీఆర్​పైకి రేవంత్​ను బరిలోకి దింపింది. మరోవైపు గజ్వేల్​లో కేసీఆర్​పో పోరుకు బీజేపీ ఈటల రాజేందర్​ను దింపింది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న ఈ రెండు నియోజకవర్గాలు చర్చనీయాంశమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news