తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ రోజు సమావేశం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సోమవారం సీఎం కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేసిన విషయం తెలిసిందే. 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. కాగ సీఎం కేసీఆర్ దీక్ష కేంద్ర ప్రభుత్వం స్పందించి.. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమని మరో సారి స్పష్టం చేసింది.
ఈ రోజు మధ్యాహ్నానానికి సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వానికి విధించి డెడ్ లైన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మధ్యాహ్నం .. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్న వరి పోరును మరింతే పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు వరి పోరును ఉధృతం చేయాలని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.