ఎస్సీ వర్గీకరణ నివేదిక పై చర్చిస్తున్న కేబినెట్ సబ్ కమిటీ

-

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజా నర్సింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు సబ్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిటీ తన నివేదికను సబ్ కమిటీ కి అందజేసింది.

తాజాగా ఎస్సీ వర్గీకరణ నివేదిక పై చర్చిస్తోంది కేబినెట్ సబ్ కమిటీ. ఈ బిల్లును కూడా కులగణన బిల్లుతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఇప్పుడు ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news