జన్వాడా ఫామ్ హౌస్ కేసు.. రేవంత్ రెడ్డి పిటిషన్ పై విచారణ వాయిదా

-

జన్వాడ ఫామ్ హౌస్  వద్ద డ్రోన్ ఎగురవేశారని తనపై నమోదైన కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దాఖలు చేసిన పిటిషన్ విచారణ తెలంగాణ హైకోర్టు  వాయిదా వేసింది. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. డ్రోన్ ఎగురవేశారని 2020 మార్చిలో రేవంత్ రెడ్డి పై నార్సింగి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని పిటిషన్ లో వెల్లడించారు.

ఈ పిటిషన్ ను సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది కేసును వాదిస్తారని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం విచారణను ఈ నెల 20 కి కోర్టు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news