తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ కేన్స్ టెక్నాలజీస్ ముందుకొచ్చింది. రూ.2800 కోట్లతో రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో భారీ సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
అవుట్ సోర్స్డ్ అసెంబ్లీ, టెస్టింగ్, కాంపౌండ్ విధానంలో అత్యధిక టెక్నాలజీతో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా 2వేల మందికి ఉపాధి దక్కనుంది. ఇది ఇలా ఉండగా, జగనన్నకు నేను చెప్పి స్థలం ఇప్పిస్తానంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్వాడ్రంట్ టెక్నాలజీస్ కంపెనీ భీమవరం, నెల్లూరులో కూడా పెట్టండి.. కావాలంటే జగనన్నకి నేను చెప్పి స్థలం ఇప్పిస్తానని వివరించారు మంత్రి కేటీఆర్. మణికొండ ఐటీ పార్కులో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు.