Waragal: కాలువలో పడిన కారు..తండ్రి. కూతురు గల్లంతు, కొడుకు మృతి

-

వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కాలువలో కారు పడింది. ఈ తరుణంలోనే తండ్రి కూతురు గల్లంతు కాగా… కొడుకు మృతి చెందాడు. తల్లిని కాపాడిన గ్రామస్తులు… గడ్డకు తీసుకొచ్చారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Car accidentally falls into canal Father and daughter missing, son dies, villagers save mother

వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంతో సహా కారులో ప్రయాణిస్తుండగా, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో వారి కారు ప్రమాదవశాత్తు పడిపోయింది. ప్రవీణ్ భార్య కృష్ణవేణిని గ్రామస్తులు కాపాడగా కొడుకు అప్పటికే మృతి చెందాడు, కాలువలో గల్లంతైన తండ్రి కూతురు కోసం గాలిస్తున్నారు స్థానికులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news