తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో కలిశారని గత కొద్ది రోజుల నుంచి పలువురు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం విధితమే. ముఖ్యంగా కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలోే రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ పర్యటనలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ పార్టీ నేతల తీరుపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక్క గుజరాత్ లోనే కాదు.. దేశంలో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారని పేర్కొన్నారు. కొందరు బీజేపీకి బీ-టీంగా వ్యవహరిస్తున్నారు.. నకిలీ నేతలకు బుద్ధి చెప్పకపోతే గుజరాత్ ప్రజల మనసు గెలుచుకోలేం అన్నారు.