కమలాపూర్‌లో పీఎస్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

-

కమలాపూర్‌లో పోలీస్ స్టేషన్​లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మంగళవారం రోజున హుజూరాబాద్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కౌశిక్.. భావోద్వేగ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు విన్న ప్రజలు నివ్వెరపోయారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ నివేదిక అందజేయాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది.

- Advertisement -

ఇంతకీ కౌశిక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటంటే..? ‘ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్ర యాత్రతో వస్తా.. ఓడితే నా శవయాత్రకు మీరు రావాల్సి ఉంటుంది. నేను ఓడిపోతే భార్యా బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంటా. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ ఓటర్లను కౌశిక్ రెడ్డి అభ్యర్థించారు. ఈ వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నివేదిక కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...