ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం

-

– చేతులెత్తిసిన రాబిన్ శర్మ team
– ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్
– కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి
– రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా లోకేష్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ రాబోతున్నది వైసీపీ ప్రభుత్వమే.అవును ఈ మాట చెబుతున్నది వైసీపీ అభిమానులు కాదు, ప్రతిపక్ష టీడీపీ గెలుపోటములను సమీక్షించే రాబిన్ శర్మ మరియు అతని బృందం. వైసీపి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి ఉండటమే దీనికి కారణం. ఈ విషయాన్ని రాబిన్ శర్మ …చంద్రబాబు,లోకేష్ వద్ద స్వయంగా ప్రస్తావించారు. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప టీడీపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమేనని తేల్చేశారు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లి వచ్చినా కూడా అనుకున్న స్థాయిలో సానుభూతి రాలేదని తేలిపోయింది. రాబిన్ శర్మ సంచలన ప్రకటనతో చంద్రబాబు,లోకేష్ ఇద్దరూ అంతర్మథనం లో పడ్డారు.

తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై ఆది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుతో కొందరు సీనియర్లు సైతం తమ టిక్కెట్లను వదులుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.నాలుగేళ్ళ పాటు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అధికార పార్టీ పెడుతున్న అక్రమ కేసులకు బెదరకుండా నిలబడ్డారు. కార్యకర్తలను సైతం కాపాడుకున్నారు. అయితే తీరా టికెట్ ఇచ్చే సమయానికి పొత్తులో భాగంగా పక్క పార్టీకి ప్రాధాన్యత రావడంతో చాలామంది వ్యతిరేకిస్తున్నారు.ఇదే విషయాన్ని రాబిన్ శర్మ…చంద్రబాబుకి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు నమ్మేస్తితిలో లేరని రాబిన్ శర్మ తేల్చి చెప్పారు. ఏం చెప్పినా ఏమి చేసినా కార్యకర్తలు పొత్తుని అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.దీంతో చంద్రబాబు,లోకేష్ తలలు పట్టుకున్నారు. ఏమి చేయాలో దిక్కు తోచక వైసీపీ ని ఎలా ఎదిరించాలో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు.

చేసేదేమీ లేక కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేయుటానికి అవసరమైన సీట్లకైనా ప్రణాళిక సిద్ధం చేయాలని రాబిన్ శర్మ ను నారా లోకేష్ అభ్యర్ధించారని సమాచారం.రాబిన్ శర్మ టీమ్ పై చంద్రబాబు మండిపడుతున్నారట.పరిస్థితి చేయి దాటిందని ఏమి చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పిన రాబిన్ శర్మ…ఈసారి 30 సీట్లకు మించి రావని తేల్చేశారు. ఓటమిని ముందుగానే నిర్ధారించడంతో టీడీపీ పనై పోయిందని తేలిపోయింది. ఈ విషయం బయటికి పొక్కడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి .

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...