OMC కేసు.. సబితా ఇంద్రారెడ్డికి ఉచ్చు బిగిస్తున్న సీబీఐ

-

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ..  తాజాగా ఓబుళాపురం గనుల లీజు కోసం అధికారులు పంపిన దస్త్రంపై సంతకం చేశానంతేనంటూ బాధ్యతలు తప్పించుకోలేరని  పేర్కొంది. మంత్రి రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలి కానీ… అధికారులు చెప్పినట్లు కాదని స్పష్టం చేసింది. ఓఎంసీ కేసు నుంచి సబితాను తొలగించవద్దని హైకోర్టును కోరుతూ  కౌంటరు దాఖలు చేసింది.

అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి.. ఓఎంసీకి లబ్ధి చేకూరేలా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది. ఓఎంసీకి లీజులివ్వడం వల్ల తాను ఎలాంటి లబ్ధి పొందలేదన్న వాదన సరికాదని పేర్కొంది. తన పదవి ద్వారా ఇతరులకు ప్రయోజనాలకు కల్పించినా అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని సీబీఐ వాదించింది. మొదట సాక్షిగా పేర్కొని.. తర్వాత కొత్త డాక్యుమెంట్లు, సాక్షులు లేకుండానే మూడో ఛార్జ్‌షీట్‌లో నిందితురాలిగా మార్చారన్న వాదన కూడా తప్పేనని.. తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించామని సీబీఐ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version