ఏపీ మాదిరిగా తెలంగాణకు కేంద్రం సహాయం చేయాలి – మంత్రి పొంగులేటి

-

బుధవారం ఖమ్మం జిల్లా లోని నేలకొండపల్లి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైందన్నారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు పొంగులేటి.

కేంద్ర ప్రభుత్వం సహకరించి నష్టాన్ని అందజేస్తుందని కోరుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నష్టానికి ఎలా చేయాలనుకుంటుందో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జరిగిన విపత్తును కూడా అలానే సహాయం అందించాలన్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు పొంగులేటి.

రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని ఆ దిశగా ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ మేరకు ప్రతి గ్రామంలో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు 5438 కోట్ల నష్టం జరిగినట్లు కేంద్రానికి లేఖ ద్వారా తెలియజేశారని తెలిపారు. ఇక తడిసిన ధాన్యాన్ని సివిల్ సప్లై అధికారులు మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందని భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news