కొత్త సాగు చ‌ట్టాల్లో మార్పులు చేయాలే !

-

  • తెలంగాణ రాష్ట్ర ప్రాణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బీ వినోద్ కుమార్

హైద‌రాబాద్ః కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై వివాదం ముదురుతూనే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు, మాజీ ఎంపీ బోయిన ప‌ల్లి వినోద్ కుమార్ ఈ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై స్పందించారు. కేంద్రం తీసుకువ‌చ్చిన కొత్త సాగు చ‌ట్టాల‌తో కొన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ.. రైతుల‌కు భ‌రోసా క‌ల్పించేలా మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలపై సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో ‘ఫార్మ్‌ బిల్‌ 2020-పాలసీ అండ్‌ పర్‌స్పెక్టివ్‌ ఫోకస్‌ ఆన్‌ తెలంగాణ అగ్రికల్చర్‌’ అనే అంశంపై వెబినార్‌లో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. పై వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు స్వాగ‌తించ‌ద‌గిన‌విగా ఉన్న‌ప్పటికీ.. పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీతో పాటు అన్న‌దాత‌లు, రైతు సంఘాల‌ను ఒప్పించి అమ‌ల్లోకి తీసుకువ‌చ్చి ఉంటే మంచిగుండేది అని పేర్కొన్నారు. జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఈ చ‌ట్టాల‌ను రైతుల‌కు అనుకూలంగా మార్చ‌డంతో పాటు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌పై రైతుల్లో ఉన్న ఆందోళ‌న‌ను దూరం చేస్తూ భ‌రోసా క‌ల్పించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. ఈ చ‌ట్టాల‌పై రైతుల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని పేర్కొన్నారు.

కాగా, ఈ వెబినార్‌లో కేంద్ర వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి మోహన్‌ కందా, మేనేజ్‌ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర, కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి సురేంద్రనాథ్‌, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్రనిమ్జె లు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news