ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు స్పష్టత రావడం లేదు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఇప్పటికే అభ్యంతరాలు చెప్పినా సరే ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలను నిర్వహించాలి అని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. అయితే నిన్న ఇచ్చిన హైకోర్ట్ తీర్పుతో ఏపీ సర్కార్ షాక్ అయింది. ఎన్నికల సంఘం స్పీడ్ గా ప్రక్రియను మొదలుపెడుతుంది.
అయితే ఏపీ సర్కార్ స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కనపడుతుంది. 10.30కి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ను పంచాయతీరాజ్ కమీషనర్ గోపాలకృష్ణ ద్వివేదీ కలుస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పై భేటీ అవుతున్నారు. అనంతరం గవర్నర్ ను కలవనున్న ఎస్ఈసీ రమేష్ కుమార్… ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ను కలవనున్న ఏపి జెఎసి అమరావతి ఉద్యోగుల సంఘం… ఎన్నికల ప్రక్రియపై తమ అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంది. ఆదిత్యనాధ్ తో జెఎసి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర నేతలు ఎన్నికల సంఘానికి తమ ఇబ్బందులు వివరించాలి అని కోరే అవకాశం ఉంది. కరోనా, వాక్సినేషన్ కారణంగా తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని సిఎస్ కు ఉద్యోగసంఘాలు వివరిస్తాయి. ఈ విషయాన్ని ఎస్ఈసీకి, కోర్టులో వివరించాలని విజ్ఞప్తి చేయనున్నారు.