Shamsabad: అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్న చిరుత..వీడియో వైరల్‌

-

Shamsabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తోంది చిరుత. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారుల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నిన్న బోన్ వరకు వచ్చి వెళ్ళిపోయింది చిరుత. ఆ చిరుత ను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 ట్రాప్ కెమెరాల ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు.

Cheetah showing dots to forest officials

అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా బోనులోకి రావడం లేదు ఆ చిరుత. ఒకే ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత…. నిన్న బోన్ వరకు వచ్చి వెళ్ళిపోయింది. ఈ చిరుత కోసం 4 రోజులుగా శ్రమిస్తున్నారు స్పెషల్ టీమ్ అధికారులు. ఒకే ప్రాంతంలో ఆ చిరుత సంచరిస్తోంది. ఆ ప్రాంతంలో నీటి కుంట ఉండటంతో.. వేరే ప్రాంతానికి వెళ్లడం లేదంటున్నారు అటవీ శాఖ అధికారులు. ఇక ఇవాళ సాయంత్రం వరకు చిరుతను పట్టుకుంటామని చెబుతున్నారు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news