100 కోట్లు పెట్టి…కాంగ్రెస్ చేవెళ్ల టికెట్ కొన్న రంజిత్ రెడ్డి ?

-

కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల టికెట్ రంజిత్ రెడ్డికి 100 కోట్లుకి అమ్మేసింది అని కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి.రంజిత్ రెడ్డికి కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితే ఎంపీ అయ్యారని బీఆర్‌ఎస్‌ పార్టీ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. మీకు రాజకీయంగా గుర్తింపు కల్పించిన వ్యక్తి కేసీఆర్‌ని కష్టకాలంలో వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదన్నారు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరడం నయవంచన, దగా, వెన్నుపోటు అంటూ నిప్పులు చెరిగారు.

Chevella MP Ranjith Reddy Quits BRS, Joins Congress

రంజిత్ రెడ్డి అన్ని విధాలా ఎదగడానికి బీఆర్ఎస్‌ కారణం చెప్పారు.కేసీఆర్ అధికారం నుంచి దూరం కాగానే రంజిత్ రెడ్డి పార్టీకి దూరమవుతారా ? కష్టకాలం లో రంజిత్ రెడ్డి కి కేసీఆర్ కు అండగా ఉండాలి కానీ వెన్నుపోటు పొడుస్తారా ? అంటూ మండిపడ్డారు. చేవేళ్ల ఎంపీ స్థానం కాంగ్రెస్ టికెట్ ను రంజిత్ రెడ్డి వంద కోట్ల రూపాయలకు కొన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

జెండా మోసిన తమకు అన్యాయం చేసి రంజిత్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయని మండిపడ్డారు. తనకు మరోసారి ఎంపీ గా పోటీ చేసే ఉద్దేశం లేదని బీ ఆర్ ఎస్ లోనే కొనసాగుతానని రంజిత్ రెడ్డి చెబితే కేసీఆర్ నమ్మారు…. కానీ కేసీఆర్ నమ్మకాన్ని రంజిత్ రెడ్డి వమ్ము చేశారని ఫైర్‌ అయ్యారు. రంజిత్ రెడ్డికి ఈ సారి ఓటమి ఖాయం….చేవెళ్లలో ముచ్చటగా మూడో సారి బీఆర్ఎస్ గెలవడం ఖాయం అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news