ఇదేందయ్యా ఇది చికెనేమో అగ్గువ.. గుడ్డు మాత్రం పిరం

-

తెలంగాణ వాసుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ మాంసం రేట్లు చూస్తేనేమో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సరే అని కోడిగుడ్లతో సరిపెట్టుకుందామనుకున్నా వాటి రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మార్కెట్ నిపుణులు నాన్ వెజ్ లవర్స్​కు గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే..?

చికెన్ ధర తగ్గిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం కిలో బ్రాయిలర్‌ కోడి మాంసం(స్కిన్‌లెస్‌) రూ.250 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.170 లోపే ఉంది. లైవ్‌ కోడి కిలో రూ.వందలకే దొరుకుతోంది. కార్తికమాసం, ఎన్నికలు ముగియడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని విక్రయదారులు చెబుతున్నారు.

హైదరాబాద్​లో సాధారణంగా ఆదివారం సగటున 12 నుంచి 15 లక్షల కిలోల కోడి మాంసం అమ్ముడవుతుంటుంది. మిగిలిన రోజుల్లో సుమారు 7 లక్షల కిలోల వరకు విక్రయాలు జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం అమ్మకాలు సగానికి పడిపోయాయి.  కార్తికమాసంలో అనేక మంది పూజలు చేస్తుండటం.. అయ్యప్ప, భవానీ మాలధారులు, శివభక్తులు మాంసాహారానికి దూరంగా ఉండటంతో గిరాకీ తగ్గినట్లు పౌల్ట్రీ వ్యాపారులు తెలిపారు.

అయితే గుడ్ల ధర మాత్రం తగ్గలేదు. వాటికి డిమాండ్‌ తగ్గకపోవడం.. లభ్యత తక్కువగా ఉండటంతో ధరఎక్కువగా ఉన్నట్లు అమ్మకందారులు చెబుతున్నారు. చిల్లరగా ఒక్కోటి రూ.6 చొప్పున వంద గుడ్లను రూ.580 చొప్పున విక్రయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version