తెలంగాణలో నేడు రేపు సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ర‌మ‌ణ ప‌ర్య‌ట‌న

భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎస్వీ ర‌మ‌ణ ఈ రోజు, రేపు తెలంగాణ లో ప‌ర్య‌టించ‌నున్నారు. శ‌ని, ఆదివారాల్లో రాష్ట్రం లోని ప‌లు జిల్లాలలో సీజేఐ ఎస్వీ ర‌మ‌ణ ప‌ర్య‌టిస్తారు. ముందుగా శ‌ని వారం ఉద‌యం 10:30 గంట‌ల‌కు హైద‌రాబాద్ లోని నాన‌క్ రాం గూడ లో ఫోనిక్స్ వీకే ట‌వ‌ర్స్ లో ఏర్పాటు చేసిన ఇంట‌ర్నేష‌న‌ల్ అర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ ( IAMC ) ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్ర‌మంలో ముఖ్య మంత్రి కేసీఆర్ తో పాటు హై కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స‌తీష్ చంద్ర పాల్గొంటారు.

అలాగే మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డీ తో పాటు ప‌లువురు సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయ‌మూర్తులు పాల్గొంటారు. అనంత‌రం ములుగు జిల్లా లోని రామ‌ప్ప ఆలాయాన్ని రామ‌ప్ప స‌ర‌స్సును సంద‌ర్శిస్తారు. అక్క‌డే రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే వింధు లో పాల్గొంటారు. అలాగే రాత్రి వ‌రంగల్ లో ఉన్న నిట్ లో బ‌స చేయ‌నున్నారు. ఆదివారం హనుమ‌కొండ సుబేదారి లో జిల్లా కోర్టు ప్రాంగ‌ణం లో నిర్మించిన న్యాయభ‌వ‌న స‌ముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మేడ్చ‌ల్ జిల్లా కు చేరుకుని న‌ల్సార్ యూనివ‌ర్సిటికి వ‌స్తారు. అక్క‌డ వ‌స‌తి గృహాల‌ను ప్రారంభించి స్నాత‌కోత్స‌వం లో పాల్గొంటారు. అనంతరం సోమ‌వారం ఉద‌యం తిరిగి ఢిల్లీ కి ప్ర‌యాణం అవుతారు.