అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతా బిశ్వకర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా హైదరాబాదులో ప్రచారం చేశారు అస్సాం సీఎం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే…హైదరాబాద్ పేరు మారుస్తామని ప్రకటించారు. చార్మినార్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ… త్వరలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును తీసుకొస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలని అనుకుంటే బిజెపి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. కచ్చితంగా బిజెపి పార్టీని గెలిపిస్తే అందరికీ న్యాయం చేస్తామని వెల్లడించారు. అలాగే వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై కూడా అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమికి రాజకీయ నాయకులు సంబంధం లేని కారణాలు చెబుతున్నారని ఆగ్రహించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున వరల్డ్ కప్ ఫైనల్ జరిగిందని.. అందువల్లే టీమిండియా ఓడిపోయిందని అస్సాం సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆ రోజున ఫైనల్ మ్యాచ్లను నిర్వహించకూడదని బీసీసీఐని కోరుతానని ఆయన వివరించారు.