కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు ఎదురు దెబ్బ తగిలింది. కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఉప్పరపల్లిలోని ఫోక్సో కోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో వచ్చే నెల 3 వ తేదీ వరకు కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు రిమాండ్ విధించనున్నారు.
అనంతరం ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు షేక్ జానీ భాషను తరలిస్తున్నారు నార్సింగి పోలీసులు. కాగా లైంగిక దాడి, ఫోక్సో యాక్ట్ కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాషను గోవా నుంచి ఇవాళ హైదరాబాద్ కు తీసుకువచ్చారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. ఈ తరునం లోనే.. లైంగిక దాడి, ఫోక్సో యాక్ట్ కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాషకు రిమాండ్ విధించింది.