ఆయన డైరెక్షన్ లోనే బీఆర్ ఎస్ పనిచేస్తోందా.. కేటీఆర్ , హరీష్ దూకుడుకి కారణమేంటి ?

-

టీఆర్ ఎస్ కాస్త.. బీఆర్ఎస్ గా మారింది.. జాతీయ స్థాయి రాజకీయాల్లో కేసీయార్ చక్రం తిప్పాలని చూశారు.. కొద్దిరోజులు హడావుడి చేసి.. జాతీయ నాయకులను కలిసి థర్డ్ ఫ్రంట్ కు ఊపిరి పోద్దామనుకున్నారు.. ఇదే సమయంలో తెలంగాణలో అధికారం కోల్పోవడంతో.. ఆయన మౌనంగా ఉండిపోయారు.. ప్రస్తుతం తెలంగాణా రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది.. అయినా కూడా కేసీఆర్ నోరు మెదపడం లేదు.. ఈ మౌనమెనుక.. వ్యూహాముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి రెండుసార్లు అధికారంలోకి రావడం దాకా.. అన్నింటిని కేసీఆర్ చాణక్యం కనిపిస్తుంటుంది.. ప్రత్యర్థులకు అంతుచిక్కని పదునైన వ్యూహాలతో… రాజకీయం చెయ్యడంలో కేసీఆర్ సిద్దహస్తుడు.. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్దులు సైతం అంగీకరిస్తారు.. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత.. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.. అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌కు తొలిరోజు హాజరైనా… ఆయన మునుపటిలా పదునైన కామెంట్స్ చెయ్యలేదు..

పొలిటికల్ పంచ్ లతో ప్రత్యర్దులను చీల్చి చెండాడుతూ.. వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసే కేసీఆర్ మౌనంగా ఉండటంతో ఆయన అభిమానులు, పార్టీ క్యాడర్ నిరాశలో ఉందట.. అయితే ఇటీవల పాడి కౌశిక్, గాంధీ వ్యవహారం రగులుతున్నా.. ఆయన బయటికి రాలేదు.. అయితే బీఆర్ ఎస్ లో జరుగుతున్న ఓ తాజా చర్చ మాత్రం ఆ పార్టీ నేతలకు హుషార్ తెప్పిస్తోంది..

తెలంగాణా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న తాను.. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చెయ్యడం తన స్థాయికి తగదని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించారట.. అందుకే ఆ బాధ్యతను కేటీఆర్‌, హరీష్‌లకు అప్పగించారని పార్టీలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.. పార్టీని గాడిన పెట్టే బాధ్యతను కూడా హరీష్‌, కేటీఆర్‌లకే వదిలేసిన కేసీఆర్‌… వారి సత్తాకు పరీక్ష పెడుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ చేస్తున్న పోరాటం కేసీఆర్‌ దిశానిర్దేశంలోనే జరుగుతోందట.. ఆయన రచించిన వ్యూహాలను బావబామర్దులు అమలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. కేసీఆర్ పక్కా వ్యూహాంతోనే సైలెంట్ ఉన్నారనిపార్టీ నేతలు చెబుతున్నారు.. ఇంతకీ గులాబీ బాస్ ఎప్పుడు బయటికి వస్తారో మరి..

Read more RELATED
Recommended to you

Latest news