మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లకు పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది. మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన మీడియాపై దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
బౌన్సర్లతో పాటూ మోహన్ బాబు విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని అదేశాలు జారీ చేసింది పోలీస్ శాఖ. కాగా, నిన్న జల్ పల్లి మోహన్ బాబు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్ గేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు. మనోజ్ తో పాటే మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబును మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మీడియా ప్రతినిధులపై దారుణంగా.. అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించారు.