హైడ్రాలజీ ఆఫ్ లేక్స్ అలాగే హైదారాబాద్ నీటి వనరుల పునరుద్ధరణ అనే అంశంపై టీం క్లైమేట్ కాంగ్రెస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.నీటి కరువు నుండి హైదరాబాద్ జంట నగరాలను విముక్తి కల్పిస్తూ నగరం మునిగిపోకుండా స్వేచ్ఛ కల్పించలని సమావేశం పాల్గొన్న పలువురు నిపుణులు తెలిపారు. అయితే హైదరాబాదులో వర్షాలు కురిస్తే దయనీ పరిస్థితి ఏర్పడుతుంది. నగరం మునిగిపోతుంది. అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి అని చెరువుల పరిరక్షణ, టీం క్లైమేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లుగ్న సర్వత్ పేర్కొన్నారు.
నగరంలో అనేక చెరువులు కబ్జా గురయ్యయీ, బఫర్ జోన్ ఆక్రమణలు గురయ్యాయి. బఫర్ జోన్ చెరువుల విస్తీర్ణం ప్రకారం 25 ఎకరాలు ఉండాలి కాని చాలా కబ్జా గురయ్యాయి. కాబట్టి వెంటనే బఫర్ జోన్ కాళీ చేయాలి. ఉస్మాన్ సాగర్ FTL ప్రకారం లేదు. జన్వాడ, గండీపేట్, బలకాపూర్ నలా కబ్జా గురయ్యాయి. బలకాపూర్ నాలా పూడ్చేసి భవనాలు కట్తారు. శంకర్ పల్లిలోని కాలువలు ఎంక్రోచ్ చేసి సిమెంట్ తో రోడ్లు వేశారు. వీటన్నిటికీ GHMC ఎలా అనుమతులు ఇచ్చింది అని లుగ్న సర్వత్ ప్రశ్నించారు.