మందు బాబులకు గుడ్ న్యూస్.. క్యాబినెట్ కీలక నిర్ణయం

-

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మద్యం ప్రియులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలలో మైక్రో బ్రూవరీ ల ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో ఇన్ స్టంట్ బీర్ కేఫ్ లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఆదాయం పెంచుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరంలో ప్రతి 5KM, పట్టణాల్లో 30KMకు ఒకటి చొప్పున మినీ బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలో మద్యం షాపుల లైసెన్స్లకు నోటిఫికేషన్లు జారీ
చేయనున్నట్లు సమాచారం.

dd

మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే బిల్లుతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే మరో బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే అసెంబ్లీ, కౌన్సిల్ లో ఆమోదించింది. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పెండింగిల్ లో ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అంతరాయం కలుగుతుందని కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు సూచనల మేరకు ఈ నెలాఖరులోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news