తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. సీఎం కప్ క్రికెట్ టోర్నీ నిర్వాహనకు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 17, 600 క్రీడా ప్రాంగణాలకు స్పోర్ట్స్ కిట్లను త్వరలో పంపిణీ చేస్తామన్నారు.
ప్రతి నియోజకవర్గంలో స్టేడియాల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర క్రీడలు క్రీడా, పర్యాటక, యువజన సర్వీసులపై అధికారులతో సమీక్ష నిర్వహించి మంత్రి దిశానిర్దేశం చేశారు. కాగా, రైతు బీమాకు అర్హులైన రైతులు సంబంధిత అధికారులకు కావలసిన పత్రాలను సమర్పించి దరఖాస్తు పూర్తి చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 18 లోపు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారిలో 18 నుంచి 59 ఏళ్ల వయసు గలవారు తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారికి దరఖాస్తు ఇవ్వాలి. తద్వారా వారికి ఆగస్టు 13 నుంచి ఏడాది పాటు జీవిత బీమా ఉంటుంది. ఏ కారణంగా చనిపోయిన రూ. 5 లక్షల పరిహారం అందుతుంది.