కేసీఆర్​తో సోరెన్ భేటీ.. త్వరలోనే బీజేపీయేతర సీఎంల సమావేశానికి నిర్ణయం

-

నిన్న రాత్రి జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ప్రగతి భవన్‌ లో కలిసారు. ఈ సందర్భంగా కీలక చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తుతూ త్వరలోనే బీజేపీ యేతర సీఎంల సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌, హేమంత్‌ సోరెన్‌ లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యమిస్తుందని.. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న చోట అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని వారు చర్చించుకున్నట్లు సమాచారం.

దీనిపై బీజేపీ యేతర రాష్ట్రాలు ఏకమై కేంద్రాన్ని ఎదిరించాల్సిందేనని మాట్లాడుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల తరఫున అభ్యర్థిని నిలిపి, సత్తా చాటాలని చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. వీరు దీనిపై దాదాపు మూడు గంటల పాటు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా.. గత నెల 4వ తేదీన జార్ఖండ్‌ రాజధాని రాంచీలో కేసీఆర్‌ పర్యటించి.. సోరేన్‌ తో భేటీ అయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version