వైసిపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ఏపీ సీఎం జగన్ సమావేశం నిన్న జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 18 నుంచి మా భవిష్యత్తు నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయ్యాక లబ్ధిదారుల ఇళ్లకు స్టిక్కర్లు అతికించనున్నారు గృహ సారథులు. ఇక ఈ సమావేశంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో పనితీరు సరిగ్గా లేదంటూ 20 మంది ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించారు సీఎం జగన్.
ముఖ్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై రివ్యూ చేసిన జగన్, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలపై జగన్ సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఇందులో కొడాలి నాని కూడా ఉండటం గమనార్హం. ఇందులో భాగంగానే, ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, సుచరిత, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఉదయభాను, కొడాలి నాని, వసంత కృష్ణ ప్రసాద్ పేర్లను చదివి వినిపించారు సీఎం జగన్. వీరి పని తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.