నిజాంసాగర్‌కు పట్టిన దుస్థితే తెలంగాణ ఉద్యమానికి నాంది : కేసీఆర్

-

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి కృతజ్ఞత సభలో ప్రసంగించారు. తన మనసులో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష పురుడు పోసుకోవడానికి నిజాం సాగర్‌కు పట్టిన దుస్థితి కూడా ఒక కారణమని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమైక్య పాలనలో ఇలాంటి ఎన్నో సమస్యలకు ఎంత ప్రయత్నించినా పరిష్కారం దొరకలేని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆషామాషీగా కట్టలేదని స్పష్టం చేశారు. తన పాలనలో నిజాంసాగర్‌ ఎప్పటికీ ఎండిపోయే ప్రశ్నే రాదని తేల్చి చెప్పారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని తిమ్మాపూర్‌లో జరుగుతున్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. దాతల సహకారంతో స్వామివారికి చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని కేసీఆర్‌ సతీమణి ఈ సందర్భంగా స్వామివారికి సమర్పించారు. వెంకటేశ్వరస్వామి కల్యాణం అనంతరం.. స్థానిక ఎమ్మెల్యే, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బీర్కూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరయ్యారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బతికున్నంత కాలం బాన్సువాడకు సేవ చేయాల్సిందేనని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version