బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల సాధన కోసం : సీఎం కేసీఆర్

-

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ హక్కుల సాధన కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో సాగు, తాగునీటి, కరెంట్‌ కష్టాలు ఉండేవని.. 1969లో ఉద్యమకారులను కాంగ్రెస్‌ పిట్టల్లా కాల్చి చంపిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో రూ.200 పింఛను ఉండేదన్న కేసీఆర్.. దేశ చరిత్రలో వందల్లో ఉన్న పింఛన్‌ను వేలల్లోకి పెంచిన ఘనత తమ పార్టీదేనని తెలిపారు. తెలంగాణను ఏపీలో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. 58 ఏళ్లు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ ఇబ్బంది పెట్టిందని అన్నారు.

“కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్నట్లు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ ప్రథమస్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో రూ.3.18 లక్షలతో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో 19వ స్థానంలో ఉన్నాం. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.” అని కేసీఆర్ తెలిపారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో అనుకున్నంత స్థాయిలో పరిణితి రాలేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని తెలిపారు. అందుకే అభ్యర్థుల గుణగణాలు ప్రజలు విచారించి ఓటు వేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news