కాంగ్రెస్ నాయకులపై సీఎం కేసీఆర్ ఫైర్

-

నేడు సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గిరిజనులకు పోడు భూముల పట్టాలను విడుదల చేశారు సీఎం కేసీఆర్. నాలుగు లక్షల ఆరువేల ఎకరాల పట్టాలు లక్షన్నర మంది గిరిజనులకు పంపిణీ చేశారు. పోడు భూములకు రైతుబంధు నిధులు కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక గిరిజన, తండా ప్రాంతాలను అభివృద్ధి చేశామన్నారు.

తెలంగాణ వచ్చింది కాబట్టే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వచ్చిందని.. మిషన్ భగీరథ ద్వారా మన్యంకు మంచినీరు అందిస్తున్నామన్నారు. ఆసిఫాబాద్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇక పోడు రైతులకు ఈ పంట నుంచే రైతుబంధు ఇస్తామన్నారు. రెండు, మూడు రోజుల్లో 47 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు అందిస్తామని తెలిపారు. రెండు, మూడు నెలల్లో గిరిజనుల పొలాల వద్దకు త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తామని.. పోడు కేసులన్నీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ధరణి తీసేస్తే లంచాలు, పైరవీలతో ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. ప్రజలు ధరణి కావాలని కోరుతున్నారని.. కాంగ్రెస్ నేతలు తీసేస్తామని చెప్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news