వికలాంగులకు కేసీఆర్ శుభవార్త..వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితబంధు !

-

వికలాంగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ లేడనీ, సమస్యలను అధిగమిస్తూ ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు.“ప్రపంచ వికలాంగుల దినోత్సవం” సందర్భంగా సీఎం దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మన్యూనతకు లోనుకాకుండా, ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని దివ్యాంగులకు సీఎం పిలుపునిచ్చారు.

ఆసరా అవసరమైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం తెలిపారు. దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి కేంద్రం అవార్డులు అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచే ఉద్దేశంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ నుండి దివ్యాంగుల (వికలాంగుల) శాఖను ప్రత్యేక శాఖగా స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు దివ్యాంగులకు రూ. 500 ల పెన్షన్ తో సరిపడితే, స్వరాష్ట్రంలో ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉంటే అంతమందికి 3,016 రూపాయల పెన్షన్ ను అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నామని సీఎం తెలిపారు. దివ్యాంగులకు డబుల్ బెడ్ రూం, దళితబంధు పథకాలతో పాటు, ఇతర పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్, ఉద్యోగ నియామకాలలో 4 శాతం రిజర్వేషన్ ను అమలు చేస్తున్నామని సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news