తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగుల ప్రకటన చేసే సమయంలో.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం 11,103 ఉద్యోగాలను కేటాయించామని సీఎం కేసీఆర్ ప్రకటించని విషయం తెలిసిందే. కాగ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చేసింది.
అలాగే 2016 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16 ప్రకారం.. రెగ్యులరైజేషన్ కు అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల పూర్తి వివరాలను పంపించాలని ఆయా శాఖలను రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశిసించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా రాష్ట్ర ఆర్ధిక శాఖ జారీ చేసింది. రెగ్యులరైజేషన్ కోసం మంజూరు అయిన పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు అనుగుణంగా రెగ్యులరైజేషన్ చేస్తామని ఆర్థిక శాఖ తెలిపింది. దీని కోసం ఆయా శాఖలు ప్రతిపాదనలను పంపించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కోరింది.