BREAKING : నేడు కేటీఆర్, హరీశ్‌తో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ నేడు మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో ప్రగతి భవన్ లో కీలక సమావేశం నిర్వహించాలన్నారు. ఎన్నికలకు ముందే పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించడం, మేనిఫెస్టోపై తుది కసరత్తు, పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై కెసిఆర్ వారితో సమాలోచనలు జరపనున్నారు. ఎలక్షన్స్ ఇన్ చార్జ్ లుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశంపైన చర్చించనున్నారు.

ఇది ఇలా ఉండగా, తెలంగాణ లో ఎన్నికల ప్రచారం షురూ అయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ ముందు నుంచే బలంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక షెడ్యూల్ విడుదల తర్వాత ప్రచారంలో జోరు మరింత పెంచింది. ముఖ్యంగా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.. సుడిగాలి పర్యటనలు చేస్తూ.. రోడ్ షోలు.. ఆత్మీయ సమ్మేళనాలతో ఓవైపు కార్యకర్తల్లో జోష్ పెంచుతూ.. మరోవైపు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.