ఈ నెల 8న తెలంగాణకు ప్రధాని మోడీ..కేసీఆర్ సర్కార్ కీలక ఆదేశాలు

-

ఈ నెల 8న తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఈ సందర్బంగా రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 7-8 తేదీల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో భాగంగా నాలుగు రాష్ట్రాలో పర్యటించనున్నారు.

జులై 8వ తేదీ ఉదయం 10:45 గంటలకు, ప్రధానమంత్రి తెలంగాణలోని వరంగల్‌కు చేరుకుని, దాదాపు రూ.6,100 కోట్ల విలువైన పలు కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే.. ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సిఎస్ శాంతి కుమారి సమీక్ష చేపట్టారు. అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్ తో పాటు బహిరంగసభ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version