ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో సినిమాలలో కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన ఇటీవల జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి జబర్దస్త్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక మళ్లీ జబర్దస్త్ వైపు వెళ్లకుండా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ ఒక బిజినెస్ ఏర్పాటు చేసి బిజినెస్ మ్యాన్ గా మారిపోయాడు. ఈ బిజినెస్ లో మంచి లాభాలను సొంతం చేసుకోవడమే కాదు సక్సెస్ఫుల్గా తన వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు కిరాక్ ఆర్ పి.
అంతేకాదు పలు నగరాలలో బ్రాంచ్లను కూడా ఏర్పాటుచేసి మరింత సక్సెస్ఫుల్గా ఎదిగారు. ఇప్పటికే ఈ చేపల పులుసు పేరు మీద ఫ్రాంచైజీలు కూడా మొదలుపెట్టిన ఆర్పి హైదరాబాదులోనే అమీర్ పేట , మాదాపూర్ , కూకట్పల్లి వంటి ప్రాంతాలతో పాటు అనంతపూర్ ,బెంగళూర్ ,విశాఖపట్నం వంటి నగరాలలో ఏర్పాటు చేసి భారీగా లాభాలు అందుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం . కొంతమంది తన బిజినెస్ ను నాశనం చేయాలని చూస్తున్నారని ఇక తన చేపల పులుసు గురించి నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన తెలిపారు.
అంతేకాదు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే పెయిడ్ బ్యాచులు తయారయ్యి తన రెస్టారెంట్ బిజినెస్ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. కొంతమంది చేపల పులుసు చూడడానికే బాగుంటుంది.. రుచి బాగుండదు అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఒకవేళ నా చేపల పులుసు రుచిగా లేకపోతే కొనడానికి ఎవరూ రారు కదా.. నేను పులుసు కోసం ఉపయోగించే చేపలన్నీ కూడా నెల్లూరు నుంచి తెప్పిస్తున్నాను. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై చేయలేకపోతున్నాము.. అంత డిమాండ్ ఉంది నా బిజినెస్ కు.. నేను క్వాలిటీ ఫుడ్ సప్లై చేస్తున్నాను.. ఇలాంటి సక్సెస్ బాట పట్టిన నన్ను కొంతమంది నెగటివ్గా నాశనం చేయాలని చూస్తున్నారు. అలాంటి వారు ఏం పీకలేరు అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు కిర్రాక్ ఆర్ పీ