BREAKING : నేడు BRS ఎమ్మెల్యేలతో CM KCR భేటీ

-

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు సీఎం కేసీఆర్ గోదావరి నది పరివాహక ప్రాంత BRS ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. గతేడాది గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

ఈ ఏడాది జులై, ఆగస్టులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో….ఎలాంటి చర్యలు చేపట్టాలో ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో సూచనలు చేసే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి మళ్లీ వర్షాలు ప్రారంభం అయ్యాయి. ఇటు హైదరాబాద్‌ మహానగరంలో ఏకంగా 5 రోజుల పాటు భారీ వర్షాటు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version