CM KCR : ఇవాళ గజ్వేల్‌, కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ నామినేషన్‌

-

CM KCR nomination : బిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నవంబర్ 9 అంటే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి గా, కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.

CM KCR nomination in Gajwel, Kamareddy today

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు గజ్వేల్ లో…మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి లో.. నామినేషన్ దాఖలు చేస్తారు గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్‌. అనంతరం కామారెడ్డి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. ఇక కార్యక్రమాల నేపథ్యంలో… రోడ్డు మార్గాన పయనం కానున్నారు సీఎం కేసీఆర్‌. కాగా, నిన్న కూడా సీఎం కేసీఆర్ ప్రయాణించే హెలికాప్టర్ సాంకేతిక కారణంతో సిర్పూర్ లోనే ఆగిపోయింది. దీంతో రోడ్డు మార్గాన అసిఫాబాద్ కి బయలుదేరారు సీఎం కేసీఆర్. అందుకే ఇవాళ రోడ్డు మార్గాన పయనం కానున్నారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news