ప్రపంచంలోనే జంతువులు అంతరించిపోతున్న రోజులు ఇవి అని చెప్పాలి. ఎందుకంటే మానవులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం అడవులను నరికివేస్తూ వాటికి ఆవాసం లేకుండా చేయడం వలన కొన్ని జనారణ్యంలోకి వస్తుంటే మరికొన్ని మరణిస్తున్నాయి. ఇక తాజాగా జింబాబ్వే లో జరిగిన ఒక ఘటన నిజంగా బాధాకరంగా ఉంది. ప్రపంచంలోనే ఏనుగులు అత్యధికంగా ఉన్న దేశంగా జింబాబ్వే రెండవ దేశంగా చెప్పుకోవాలి. కానీ శాస్త్రవేత్తలు తెలియచేస్తున ప్రకారం 2020 నుండి గమనిస్తే వందల ఏనుగులు మరణిస్తున్నాయన వాస్తవాన్ని తెలియచేశారు. ఇంకా ఈ సంవత్సరం మే మరియు జూన్ నెల సమయంలో 350 ఏనుగులు మరణించడం చాలా బాధాకరం. అడవుల్లో ఎండ మరియు కరువు కారణంగా ఏనుగులు వాటిని తట్టుకోలేక వాటి శరీరంలో బ్యాక్టిరియా పెరిగిపోవడంతో, రక్తం విషపూరితం కావడంతో మరణించాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ వార్తను వినగానే ఎంత బాధగా ఉందో, వాటికి మనలాగే ప్రాణం ఉంటుంది. ఇక అదే అడవుల్లో నివసించే వాటికన్నా చిన్న జంతువుల పరిస్థితి ఏమిటన్నది ఆలోచిస్తేనే గుండె తరుక్కుపోతోంది.