సీఎం కేసీఆర్ తీపికబురు.. ‘‘గృహలక్ష్మి” పథకంపై కీలక ప్రకటన చేశారు. పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగగా.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కోసం‘‘గృహలక్ష్మి” పథకాన్ని కూడా ప్రారంభించుకున్నామన్నారు.
ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహనిర్మాణం కోసం మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. తొలిదఫాలో రాష్ట్రంలోనిప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన అగ్గిపెట్టెల లాంటి ఇండ్ల స్థానంలో అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఉచితంగా అందించాలన్నది బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ గృహాల నిర్మాణం కొనసాగిస్తున్నాం. ఇది నిరంతర కొనసాగే ప్రక్రియ అని చెప్పారు.